వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సిట్ అధికారులు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు. ఈ కేసులో తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించారు. కడప శివారులోని పోలీసు శిక్షణ కేంద్రంలో 5 గంటల పాటు విచారణ జరిగింది. వివేకా హత్య గురించి తనను సిట్ అధికారుల ప్రశ్నించారని... వారు అడిగినవాటికి తెలిసిన సమాధానాలు చెప్పానని రవి వివరించారు. ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానని తెలిపారు. వివేకాపై పోటీ చేసి గెలిచినందున... పులివెందుల రాజకీయ పరిస్థితులపై తనకు అవగాహన ఉందని... కేసు విచారణకు తాను ఇచ్చే సమాచారం ఉపయోగపడుతుందని సిట్ అధికారులు భావించారన్నారు.
ఇదీ చదవండి: వివేకా హత్య కేసులో సిట్ ముందుకు బీటెక్ రవి