విశాఖ జిల్లా కొయ్యూరు మండలం బాలారం గ్రామానికి చెందిన అప్పన్న శ్రీరాములు, అప్పన్న రమణాజీ అన్నాదమ్ముళ్లు. వీరు కరోనాతో బాధపడుతూ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆకస్మికంగా పల్స్ పడిపోవడంతో శ్రీరాములు మృతిచెందారు. మృతుడు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచిగా ఎన్నికయ్యారు. శ్రీరాములు తమ్ముడు రమణాజీ విశాఖ కేజీహెచ్‌లో కరోనాతో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఇద్దరు అన్నదమ్ములు ఒకే రోజు కరోనాతో చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
కడప జిల్లా బద్వేలులో కరోనా లక్షణాలతో మొబైల్ షాప్ యజమాని సుబ్బయ్య, ఇంజినీరింగ్ విద్యార్థి ప్రవీణ్ మృతిచెందారు. కరోనా వ్యాధి నియంత్రణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ... మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది.
ఇదీచదవండి.