కడప జిల్లా సిద్ధవటం వద్ద పెన్నా నదిపై నిర్మించిన వంతెన పగుళ్లు వచ్చి ఇనుప కడ్డీలు బయటపడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. ఈ వంతెనపై నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. వాహనాలు వెళ్లే సమయంలో వాటి ధాటికి వంతెన ఊగుతూ ప్రమాదకరంగా కనిపిస్తోంది. ప్రస్తుతం పెన్నా వరద నీరు పొంగి పొర్లుతున్న సమయంలో ఈ వంతెనపై ప్రయాణం చేసేందుకు వాహన చోదకులు భయాందోళనకు గురవుతున్నారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన వంతెనను అధికారులు పట్టించుకోకపోవటంతో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ప్రమాదం జరిగితే తప్ప అధికారులు పట్టించుకోరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఇదీ చదవండి : తగ్గుతూ..పెరుగుతున్న పెన్నా నది వరద ప్రవాహం