ETV Bharat / state

జమ్మలమడుగులో భాజపా ప్రచారం

కడప జిల్లా జమ్మలమడుగు నగర పంచాయతీలో ప్రచారాలు ఊపందుకున్నాయి. ప్రధాన పార్టీల పెద్దలు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వైకాపా చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు తారా స్థాయికి చేరుకున్నాయని భాజపా జిల్లా కార్యదర్శి లక్ష్మీ నారాయణ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు చలపతి ధ్వజ మెత్తారు.

bjp leaders election campaining
జమ్మలమడుగులో భాజపా ప్రచారం
author img

By

Published : Mar 4, 2021, 6:44 PM IST

నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి కావటంతో.. బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారాల బాటపట్టారు. కడప జిల్లా జమ్మలమడుగు నగర పంచాయతీలో రాజకీయ పార్టీల నేతల ప్రచారాలు ఊపందుకున్నాయి. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మూడో వార్డులో భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి ఇంటింటి తిరిగి తమ పార్టీ అభ్యర్ధి తరుపున ప్రచారం నిర్వహించారు. భాజపా అభ్యర్థిని గంగాభవాని గెలిపించాలని ఓటర్లను కోరారు. అయితే భాజపా అభ్యర్థికి మద్దతుగా ఇక్కడ ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించటం విశేషంగా మారింది.

ఇలాంటి ఏకగ్రీవాలు చెల్లవని ఉత్తర్వులు ఇవ్వాలి..

మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో.. ఇప్పుడు జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో వైకాపా చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు తారా స్థాయికి చేరుకున్నాయని భాజపా జిల్లా కార్యదర్శి లక్ష్మీ నారాయణ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు చలపతి ధ్వజ మెత్తారు. ఇప్పటివరకు తమ రాజకీయ చరిత్రలో ఇలాంటి ఎన్నికలు చూడలేదని వాపోయారు. కడపలో 25వ డివిజన్​లో పోటీ చేస్తున్న వైకాపా అభ్యర్థి ఏకగ్రీవల కోసం ఇప్పటివరకు 29 లక్షల రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించారు. ఇలాంటి ఏకగ్రీవాలు చెల్లవని ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి...: 'సర్పంచ్ గా గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.