ETV Bharat / state

వైకాపా బెదిరింపు చర్యలకు పాల్పడుతోంది: కన్నా

author img

By

Published : Feb 19, 2020, 4:04 PM IST

రాష్ట్ర భాజపా అధికార ప్రతినిధి బండి ప్రభాకర్​పై వైకాపా నాయకులు పెట్టిన అక్రమ కేసులను నిరసిస్తూ.. భాజపా నాయకులు కడపలో ధర్నా నిర్వహించారు. పోలీసులను అడ్డు పెట్టుకుని ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు చేస్తుందని ఆరోపించారు.

bjp leaders dharna in kadapa
కడపలో భాజపా నాయకులు ధర్నా
వైకాపా సర్కారుపై భాజపా నాయకుల విమర్శలు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఫ్యాక్షన్ రాజకీయ చరిత్రను రాష్ట్రంలో కొనసాగిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. కడప నగరంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్​పై వైకాపా నాయకులు పెట్టిన అక్రమ కేసులను నిరసిస్తూ... భాజపా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి కన్నా లక్ష్మీనారాయణతో పాటు కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, రాష్ట్ర మాజీ మంత్రులు ఆదినారాయణరెడ్డి, రావెలకిషోర్ బాబు, ఎమ్మెల్సీ మాధవ్, జిల్లా నాయకులు పాల్గొన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లలో పోలీసులను అడ్డం పెట్టుకుని ఏ విధంగా పాలన సాగించిందో... వైకాపా ప్రభుత్వం కూడా అదే విధానం అవలంబిస్తోందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. స్థానిక సంస్ధలను ఎదుర్కోలేక... వాలంటీర్ల చేతే వైకాపాకు ఓటు వేయకపోతే పింఛన్లు, రేషన్ కార్డు తొలిగిస్తామని బెదిరిస్తున్నారంటే పాలన ఎంత దిగిజారిందో అర్థం చేసుకోవచ్చన్నారు.

జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది: పురందేశ్వరి

చంద్రబాబు ప్రభుత్వం లాగానే జగన్ సర్కారు కూడా అవినీతిలో కూరుకు పోయి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి అన్నారు. పీపీఏల పరిస్థితి రాష్ట్రంలో ఏ విధంగా అమలవుతుందో అర్థం అవుతోందన్నారు. తన బాబాయ్ వివేకా హత్యకేసును సీబీఐ విచారణకు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెనకడుగు వేస్తున్నారో ప్రజలకు వివరించాలని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి డిమాండ్​ చేశారు.

ఇవీ చదవండి:

సీబీఐకి కర్నూలు యువతి అత్యాచార కేసు.. సీఎం హామీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.