ETV Bharat / state

Pawan security: పవన్‌ కల్యాణ్​కు 'వై' కేటగిరి భద్రత కల్పించాలి: ఆదినారాయణరెడ్డి - వైసీపీ

Adinarayana Reddy comments on Jagan: వైసీపీ అధికారం కోసం ఎంతకైనా తెగిస్తుందని భాజపా నేత ఆదినారాయణరెడ్డి విమర్శించారు. తనకు ప్రాణహాని ఉందని పవన్‌ కల్యాణ్ ఇప్పుడు తెలుసుకున్నారని.. రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్రం చొరవ తీసుకుని పవన్‌కు వై కేటగిరి భద్రత కల్పించాలన్నారు.

Adinarayana Reddy
Adinarayana Reddy
author img

By

Published : Jun 19, 2023, 7:13 PM IST

Adinarayana Reddy key comments on Pawan security: ప్రాణహాని ఉందని పవన్‌ ఇప్పుడు తెలుసుకున్నారని, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి వెల్లడించారు. పవన్‌ కల్యాణ్‌ బీజేపీతో కలిసి పని చేస్తున్నారనే.. కుట్ర చేస్తున్నారని ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. అధికారం కోసం వైసీపీ ఎంతకైనా తెగించే మనస్తత్వమని ఆయన విమర్శించారు. ఎన్ని కోట్లు సంపాదించినా జగన్‌ ఆశ తీరదని ఆదినారాయణరెడ్డి మండిపడ్డారు. జగన్‌ నిత్య అసంతృప్తి వాది.. చెప్పేవన్నీ అబద్ధాలే అంటూ విమర్శించారు. పార్టీ పరంగా, ప్రభుత్వపరంగా అన్నింట్లో సకల శాఖ మంత్రి జోక్యమే ఉందని ఎద్దేవా చేశారు. వైసీపీ అవినీతిని ఎండగట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. అక్కను వేధిస్తున్నారని ప్రశ్నిస్తే పెట్రోల్‌ పోసి తమ్ముడిని చంపుతారా? అంటూ విమర్శించారు. ఇలాంటి ఘటనలకు జగన్‌ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు త్వరలో వివేకా హత్యకేసులో అందరి బండారం బయటపడుతుందని ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. పవన్‌కు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వం కలుగజేసుకుని పవన్‌కు వై కేటగిరీ భద్రత కల్పించాలని సూచించారు.

పవన్‌కు వై కేటగిరి భద్రత కల్పించాలని ఆదినారాయణరెడ్డి డిమాండ్

ఈ నెల తేదీన కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటుగా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా చేసిన వ్యాఖ్యలను ప్రజలు అర్థం చేసుకోవాలని ఆదినారాయణరెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా వైఎస్ వివేకా హత్య కేసులపై ఆయన మాట్లాడారు. తన స్వంత బాబాయినే చంపించి.. ఆ హత్యను టీడీపీ నేతలపై మోపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అది వీలు కాకపోవడంతో బెంగుళూరు ఘటనలో లావాదేవీల వల్ల హత్య జరిగిందని ఆరోపించారని, తరువాత వివేకాకు ఉన్న అక్రమ సంబంధాల వల్లే హత్య జరిగిందని కొత్త వాదన తెరపైకి తెచ్చారని ఆదినారాయణరెడ్డి విమర్శించారు. వైసీపీ నేతలు అడ్డుతగలడంతో సుప్రీం కోర్టులో సునీతే తన తండ్రి కేసును వాదించుకుంటున్నారని వెల్లడించారు. వివేకా హత్య కేసులో సుప్రీం డెడ్​లైన్ దగ్గర పడిందన్న ఆదినారాయణరెడ్డి ఎట్టకేలకు దోషులకు శిక్షపడే సమయం దగ్గర పడిందన్నారు. జగన్​కు అడ్డువచ్చిన వారిని ఎమైనా చేసే రకం అని పవన్ విమర్శించారు. అందుకోసమే పవన్​కు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతున్నట్లు వెల్లడించారు.

తన అక్కను ఓ ఆకతాయి వేదిస్తుంటే అమర్​నాథ్ అనే పిల్లవాడు అడ్డుపడినందుకు అతన్ని నిప్పుపెట్టి చంపారని మండిపడ్డాడు. ఇలాంటి ఘటన వల్ల రాష్ట్రంలో ప్రశ్నించేవారు బయపడే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆరోపించారు. లిక్కర్ కింగ్ స్టిక్కర్ కింగ్​గా మారిపోయాడని ఆరోపించారు. రోడ్ల నిర్మాణం కోసం కేంద్రం డబ్బులు ఇస్తుంటే రాష్ట్రం దోచుకుంటుందని ఆరోపించారు. కేంద్రం 30 లక్షల ఇళ్లను కేటాయిస్తే వాటిని పూర్తి చేయలేదని విమర్శించారు. జగన్ తల్లి విజయమ్మను రాష్ట్రపతిని చేసినా.. తన కూతుళ్లను మంత్రులు చేసినా... కాబోయే అల్లుళ్లను పక్కరాష్ట్రాలకు ముఖ్యమంత్రులను చేసినా.. ఆయన సంతృప్తి చెందరని మిమర్శించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.