రాష్ట్ర ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తోందని భాజపా కిసాన్ మోర్చా రాష్ట్రాధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి ఆరోపించారు. రెండేళ్ల క్రితం ఇరిగేషన్ కోసం నాబార్డు ద్వారా కేేంద్రం.. రాష్ట్రానికి రూ.1000 కోట్లు ఇస్తే ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి పరికరాలను కొనుగోలు చేయలేదన్నారు. కడపలోని ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఖరీఫ్ సీజన్లో నైనా నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భాజపాను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం భాజపా జిల్లా కిసాన్ మోర్చా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
ఇదీ చదవండి: మంత్రి అప్పలరాజుపై.. కర్నూలు వన్‌టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు