నవంబరులో కడప జిల్లా మైదుకూరు ప్రాంతంలో చలి తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. కేసీ కాలువ ఆయకట్టు ప్రాంతమైన మైదుకూరు, దువ్వూరు, ఖాజీపేట, చాపాడు మండలాల పరిధిలో రహదారులకు ఇరువైపులా పచ్చటి పొలాలు ఉన్నాయి. వాటి పచ్చదనం మధ్య పొగమంచు అందాలు కనువిందు చేస్తున్నాయి. రహదారిపై రాకపోకలు సాగించే వారికి ప్రత్యేక అనుభూతిని కలిగిస్తున్నాయి.