ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: జమ్మలమడుగులో మూతపడ్డ రెండు బ్యాంకులు - జమ్మలమడుగులో మూతపడ్డ బ్యాంకులు

కరోనా మహమ్మారి ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. లాక్ డౌన్ విధించినా కట్టడి కాకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో రెండు ప్రధాన బ్యాంకులతో పాటు ఓ ప్రైవేటు ఆసుపత్రి సైతం మూతపడింది. వాటిలో పనిచేసే సిబ్బందికి కరోనా సోకటంతో మూసివేసినట్లు అధికారులు తెలిపారు.

banks are closed in jammalamadugu at kadapa district
జమ్మలమడుగులో మూతపడ్డ రెండు బ్యాంకులు
author img

By

Published : Aug 14, 2020, 6:04 PM IST

కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో రోజురోజుకు కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. బ్యాంకు అధికారులకు సైతం కరోనా సోకడంతో రెండు బ్యాంకులను మూసివేశారు. జమ్మలమడుగు పట్టణంలో రెండు ప్రధాన బ్యాంకులతో పాటు ఓ ప్రైవేటు ఆసుపత్రి సైతం మూత పడింది. ఆంధ్రా బ్యాంకు, కెనరా బ్యాంకులో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులకు కరోనా వైరస్ సోకింది. ప్రధానమైన బ్యాంకులు మూతపడటంతో ఖాతాదారులు అవస్థలు పడుతున్నారు.

రెండు రోజుల క్రితమే వైఎస్సార్ చేయూత పథకం కింద మహిళలకు రూ.18,750 వారి ఖాతాల్లో జమయ్యాయి. చాలామంది మహిళలు డబ్బులు ఇంకా తీసుకోలేదు. ఈలోగా ఆ రెండు బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కరోనా రావడంతో అవి మూతపడ్డాయి. దీంతో పాటు ఓ ప్రైవేటు ఆసుపత్రి సైతం మూతపడడం వల్ల పట్టణ ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే జమ్మలమడుగు పట్టణంలో 350 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు పట్టణంలో లాక్ డౌన్ విధించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నా... కేసుల సంఖ్య అదుపులోకి రాకపోవడం వల్ల అధికారులకు సవాలుగా మారింది.

ఇదీ చదవండి:

కరోనా బారిన పడుతున్న పారిశుద్ధ్య కార్మికులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.