అకాల వర్షాలు అరటి రైతును దిక్కుతోచని స్థితిలోకి నెట్టిపడేశాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి నేలపాలు కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. కడప జిల్లా పులివెందుల మండలంలో బుధవారం రాత్రి వీచిన పెనుగాలులు, వడగండ్ల వర్షానికి దాదాపు 100 ఎకరాల్లో అరటి పంట నేల కూలింది. రెండు కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది. కే. వెలమ వారి పల్లి, నల్లపురెడ్డిపల్లి గ్రామాల్లో అరటి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పులు తీరే మార్గం లేదని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుకుంటున్నారు.
ఇదీ చదవండి