ETV Bharat / state

ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కోనేందుకు సిద్ధం: బీటెక్‌ రవి - కడప జిల్లా తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవికి బెయిల్

ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కోనేందుకు సిద్ధమని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్‌ రవి అన్నారు. 2018 మార్చి 4న పులివెందులలో జరిగిన ఘర్షణ కేసులో రిమాండ్​లో ఉన్న ఆయనకు ఉదయం పులివెందుల కోర్టు బెయిలు మంజూరు చేసింది. సాయంత్రం కడప కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు.

bail for b.tech ravi
తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవికి బెయిల్ మంజూరు
author img

By

Published : Jan 18, 2021, 12:36 PM IST

Updated : Jan 18, 2021, 8:08 PM IST

తెదేపా నాయకులపై ముఖ్యమంత్రి జగన్ అక్రమ కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేయాలని చూస్తే భయపడే ప్రసక్తే లేదని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి తేల్చి చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కోనేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. 2018 మార్చి 4న పులివెందులలో జరిగిన ఘర్షణ కేసులో రిమాండులో ఉన్న ఆయన ఇవాళ బెయిలుపై విడుదలయ్యారు.

తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవికి బెయిల్​పై విడుదల

ఎస్సీ, ఎస్టీల్లో చేర్చండి...

వైకాపా ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని రవి ఆరోపించారు. చెన్నై విమానాశ్రయంలో ఎస్సీ,ఎస్టీ కేసులో అరెస్ట్ చేశామని చెప్పిన పోలీసులు..తర్వాత ఘర్షణ కేసులో అని అరెస్ట్ చేస్తున్నట్లు మాట మార్చారన్నారు. కానీ రిమాండులోకి వెళ్లిన తర్వాత మళ్లీ ఎస్సీ,ఎస్టీ కేసులో పీటీ వారంట్ వేయడాన్ని ఏమనుకోవాలని ప్రశ్నించారు. రెండేళ్ల పాటు పులివెందులలోనే తాను ఉన్నానని..అప్పుడు అరెస్ట్ చేయకుండా చెన్నైలో అరెస్ట్ చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని..తమను కూడా ఎస్సీ,ఎస్టీల్లో చేర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అక్రమ కేసుల నుంచి తప్పించుకోవాలంటే తమను ఎస్సీ,ఎస్టీల్లో చేర్చడమే శరణ్యమన్నారు. తెదేపా నాయకులను ఏ విధంగా జైలుకు పంపాలనే దానిపై దృష్టి పెడుతున్న జగన్.. వివేకా హత్య కేసును తేల్చేందుకు శ్రద్ధ చూపించాలని హితవు పలికారు.

ఇదీ చదవండి:

బోయిన్​పల్లి కిడ్నాప్ కేసు: రూ.10 లక్షలకు కిడ్నాప్‌ ఒప్పందం

Last Updated : Jan 18, 2021, 8:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.