స్వార్థం పెరుగుతున్న ఈ రోజుల్లో ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని నిరూపించుకున్నారు. తన ఆటోలో ప్రయాణికుడు మర్చిపోయిన విలువైన ల్యాప్‌టాప్‌ను పోలీసులకు అందజేశాడు. కడప జిల్లా బద్వేలు పురపాలకలోని చెన్నంపల్లికి చెందిన ఆటోడ్రైవర్ రామదాసు ఆటోలో ఓ ప్రయాణికుడు ల్యాప్‌టాప్ మర్చిపోయారు.
అది గుర్తించిన రామదాసు వెంటనే పోలీసులకు అందజేశాడు.. ల్యాప్‌ట్యాప్‌ను పోగొట్టుకున్న వ్యక్తి సురేష్‌గా గుర్తించి పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. ఆటోడ్రైవర్ రామదాసు చేతుల మీదుగానే పోలీసులు అతనికి ల్యాప్‌ట్యాప్‌ను అందజేశారు. రామదాసు నిజాయతీని పోలీసులు అభినందించారు.
ఇదీ చదవండి: