ETV Bharat / state

కరవు సీమలో ఏరువాక... జోరుగా పొలం పనులు - కడపలో ఏరువాక... జోరుగా పొలం పనులు

కొన్నేళ్లుగా వర్షాల్లేక పంటలు పండక అవస్థలు పడుతున్న అన్నదాతలకు ఇటీవల కురిసిన వర్షాలు ఉపసమనం కలిగిస్తున్నాయి. వానదేవుడు కరుణించాడు. చినుకులతో బీడు భూములను తడిపాడు. రైతన్నల కన్నీటిని తుడిచాడు. వారి మనసులో పంట పండించాలనే కాంక్ష పెంచాడు. ఫలితంగా అధిక దిగుబడి పొందేలా వరి సాగు చేస్తున్నారు రాయలసీమలోని కడప జిల్లా రైతులు.

Aruvaca in the famine  of rayalaseema
కడపలో ఏరువాక... జోరుగా పొలం పనులు
author img

By

Published : Dec 17, 2019, 3:58 PM IST

కడపలో ఏరువాక... జోరుగా పొలం పనులు

వర్షాలపై ఆధారపడిన రాయలసీమ సాగు భూములు ఇప్పుడు కళకళలాడుతున్నాయి. రైతన్నలూ...రండి! సాగు చేయండి అని పిలుస్తున్నాయి. ఈ ఏడాది రబీలో పంటల సాగుకు వర్షాలు అనుకూలించాయి. కుంటలు, చెరువుల్లోకి నీరు చేరింది. బోరు బావుల్లో భూగర్భజలాలు పెరిగాయి. రైతన్న మదిలో పంట పండించాలనే కోరిక పెంచాయి. బీడు భూముల్లో పంటల సాగుకు సమాయత్తమయ్యారు.

సర్కారు ఆదుకోకపోయినా...

ప్రభుత్వం నుంచి రాయితీ ఎరువులు, విత్తనాలు అందరికీ అందకపోయినా... అధిక ఖర్చులు భరించి వరి సాగుకు రైతులు ముందుకు వెళ్తున్నారు. దుక్కు, ఎరువులు, కూలీలు కలిపి ఎకరా పోలానికి సుమారు రూ.30 వేలు పెట్టుబడి అవుతుందని కడప జిల్లాకు చెందిన పలువురు రైతులు చెబుతున్నారు.

కొట్టుమిట్టాడుతోన్న కర్షకులు

నిత్యం కరవు తాండవిస్తోన్న సీమ జిల్లాల్లో సాగునీటి లభ్యత తక్కువగా ఉంటుంది. కేవలం బోరుబావుల పైనే ఆధారపడాలి. అలా అని పంట సాగుచేద్దామన్నా... చివరి వరకు నీరు అందుతుందనే నమ్మకం లేదని రైతులు వాపోతున్నారు. హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు తీసుకొచ్చి సీమను సస్యశ్యామలం చేస్తామన్న పాలకుల మాటలు... ఇప్పటికీ నెరవేరలేదన్న ఆవేదన వారిలో ఉంది. ఫలితంగా పంటలు పండించలేక, ఆశ చావక అయోమయంలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.

మెరుగైన మార్గాలు

రైతులు అధిక దిగుబడి కోసం తమకు తోచిన మార్గాలు ఎంచుకుంటున్నారు. దుక్కిలో పచ్చిరొట్ట ఎరువులు ఉపయోగిస్తున్నారు. రసాయన ఎరువుల కంటే ఇవి పంటకు అధిక బలాన్ని చేకూరుస్తాయని రైతులు తెలిపారు. వీటితోపాటు ఆముదం, కానుగ, వేప పిండి చల్లుతున్నారు. మరి కొందరు పొలం గట్లపై ఉన్న చెట్ల ఆకులను కత్తిరించి దుక్కిలో వేసి దున్నుతున్నారు. 20 నుంచి 25 రోజుల లోపలే ఆకులు కుళ్ళి సేంద్రియ ఎరువులుగా మారి... వరి మొక్కలకు తోడ్పడతాయన్నారు. వరి పంటను చీడపీడలు ఆశించకుండా అక్కడక్కడా కొంత ఖాళీ ప్రదేశాన్ని వదులుతున్నారు. దీనివల్ల పైరుకు గాలి తగిలి అధిక దిగుబడికి ఆస్కారం ఉంటుందని రైతులు చెప్పుకొస్తున్నారు.

ఆరుగాలం కష్టపడే తమకు అధికారుల నుంచి సరైన సాకారం అందితే... సేంద్రియ సాగుతో పాటు అధిక దిగుబడులను సాధిస్తామని రైతులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి:

"పాలకులు మారినా.. మా బతుకులు మారలేదు"

Intro:స్క్రిప్ట్ రబీలో బోరుబావుల కింద eenadu వరి నాట్లు ప్రయత్నం చేస్తున్నారు అరకొరగా ఉన్న నీటిపై ఆధారపడి నీటి ఆధారిత పంట సాగుపై కథనం

Body:స్క్రిప్ట్ రబీలో బోరుబావుల కింద eenadu వరి నాట్లు ప్రయత్నం చేస్తున్నారు అరకొరగా ఉన్న నీటిపై ఆధారపడి నీటి ఆధారిత పంట సాగుపై కథనం

Conclusion:స్క్రిప్ట్ రబీలో బోరుబావుల కింద eenadu వరి నాట్లు ప్రయత్నం చేస్తున్నారు అరకొరగా ఉన్న నీటిపై ఆధారపడి నీటి ఆధారిత పంట సాగుపై కథనం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.