ETV Bharat / state

మంచి మనసు చాటుకున్న విద్యుత్ ఉద్యోగులు - ఏపీ తాజా వార్తలు

లాక్​డౌన్​ వల్ల ఉపాధి లేక కడుపు నిండక చాలామంది పేదలు కష్టాలు పడుతున్నారు. అలాంటి వారికి కడప జిల్లా విద్యుత్తు ఉద్యోగుల సామాజిక సేవా సంఘం తమ వంతు సాయం అందిస్తోంది. ఒక్కొక్కరికి 800 రూపాయలు విలువ చేసే నిత్యావసర సరకులను పంపిణీ చేస్తోంది.

APSPDCL workers distributed essential commodities to poor

author img

By

Published : Apr 8, 2020, 8:48 PM IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు కడప జిల్లా విద్యుత్తు ఉద్యోగుల సామాజిక సేవా సంఘం ప్రతినిధులు ముందుకొచ్చారు. ఒక్కో కుటుంబానికి 800 రూపాయలు విలువ చేసే నిత్యావసర సరకులను మైదుకూరు, దువ్వూరు, వనిపెంట ప్రాంతంలోని 200 మంది పేద కుటుంబాలకు బుధవారం పంపిణీ చేశారు. విద్యుత్తు శాఖ ఎస్‌ఈ శ్రీనివాసులు, డీఈఈ వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డీఎస్పీ విజయ్‌కుమార్‌ పాల్గొని పేదలకు అందజేశారు. విద్యుత్తు ఉద్యోగుల నుంచి సేకరించిన రూ.10 లక్షలతో జిల్లాలోని ఆరు డివిజన్ల పరిధిలో పేదలకు నిత్యావసర సరకులు పంపిణీకి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.