ETV Bharat / state

APNGO : ఈ నెలాఖరులోగా నిర్ణయం తీసుకోకపోతే..

ఉపాధ్యాయ, కార్మిక సంఘాల సమస్యలపై.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఏపీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి శివారెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే.. ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

apngo
apngo
author img

By

Published : Nov 24, 2021, 5:29 PM IST

ఈ నెలాఖరులోగా.. ఉపాధ్యాయ, కార్మిక సంఘాలకు సంబంధించి పెండింగ్​లో ఉన్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని.. లేదంటే ఉద్యమం తప్పదని ఏపీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి శివారెడ్డి అన్నారు. ఉద్యమం చేపడితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.

కడప ఎన్జీవో కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 27, 28 తేదీలలో విజయవాడలో ఏపీ ఎన్జీవో, ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని సంఘాలనూ కలుపుకొని రెండు రోజులపాటు సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్ని సంఘాల అభిప్రాయాలనూ తీసుకుని త్వరలో కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఇప్పటికే ఏడు డీఏలు పెండింగ్​లో ఉన్నాయని, ఏ ప్రభుత్వంలోనూ ఇలా జరగలేదని మండిపడ్డారు. ప్రభుత్వం అన్ని సంఘాల నాయకులనూ పిలిపించి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: స్టార్మ్ పోలీసింగ్​లో ఏపీకి ఫస్ట్ ర్యాంక్.. సీఎం జగన్ అభినందన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.