కొవిడ్ విధుల్లో ఉంటూ మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుని కుటుంబాన్ని ఆదుకోవాలని కొరుతూ కడప కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ నిరసన చేపట్టింది. పారిశుద్ధ్య కార్మికుడు చలపతి బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ గుండెపోటుతో మృతి చెందాడు.
మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని మృతదేహాన్ని నగరపాలక కార్యాలయం వద్దకు తీసుకొచ్చి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు... అధికారులతో మాట్లాడి అతని కుటుంబానికి లక్షా 25 వేల రూపాయలు, ఉపాధి కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఇదీ చదవండి:
రేపు రాష్ట్ర బడ్జెట్.. పిల్లలు, మహిళలకు ప్రత్యేక కేటాయింపులు