కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని కుందూ నదీ పరివాహక ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి పర్యటించారు. ఇటీవల కురిసిన వర్షాలతో వరద ప్రవాహానికి గురైన పంటలను ఎమ్మెల్యే రవీంధ్రనాథ్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. పంటకు పెట్టిన పెట్టుబడి... జరిగిన నష్టాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని నాగిరెడ్డి హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి