కడప జిల్లా కొండాపురం మండలం తాళ్ల పొద్దుటూరు గ్రామంలో గండికోట నిర్వాసితుల దీక్షలు 33 వ రోజుకు చేరుకున్నాయి. తమ డిమాండ్లను పరిష్కరించిన తర్వాతే గండికోటలో నీళ్లు నింపాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం గండికోట జలాశయంలో 16.5 టీఎంసీలకు నీటినిల్వ చేరుకుంది.దీంతో తాళ్ల పొద్దుటూరు గ్రామంలోని బీసీ, ఎస్సీ కాలనీలో వెనుక జలాలు చేరడంతో బాధితులు ఇళ్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. కటాఫ్ తేదీ పెంచాలని, పునరావాస కాలనీల్లో సదుపాయాలు మెరుగుపరచాలని , వెలుగొండ తరహా ప్యాకేజీ కల్పించాలని నిర్వాసితులు కోరారు.
ఇవీ చదవండి: ప్రొద్దుటూరులో రోడ్డు ప్రమాదం..కారు ఢీకొని వ్యక్తి మృతి