కడప జిల్లా సుండుపల్లి మండలంలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. ఐదేళ్ల బాలికపై పదహారేళ్ల బాలుడు అత్యాచారానికి యత్నించాడు. రోజూ ఇంటికి వచ్చి చిన్నారికి తినుబండారాలను పెట్టేవాడు అతను. గురువారం కూడా ఇంట్లోకి వచ్చిన ఆ కామాంధుడికి ఐదేళ్ల చిన్నారి ఒంటరిగా కనిపించింది. బాలికపై అఘాయిత్యానికి యత్నించాడు. అంతలోనే ఇంటి వారు రావటంతో అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు సుండుపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దారుణానికి ప్రయత్నించిన బాలుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భక్తవత్సలం పేర్కొన్నారు.
ఇదీ చదవండి