కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఎస్ఆర్ఐటి కళాశాలలో... 65వ జాతీయ స్థాయి విలువిద్య పోటీలు జరిగాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రారంభించారు. 30 రాష్ట్రాల నుంచి 570 మంది క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు. ఏపీ క్రీడాకారులు పలు పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ... జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధిస్తుండడం ఆనందంగా ఉందన్నారు. వైకాపా ప్రభుత్వం క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని... అందుకోసం బడ్జెట్ కేటాయింపులు చేశామని వివరించారు.
ఇదీ చదవండి: లోకానికి సెలవు... అవయవాలు దానం చేయాలంటూ సూసైడ్ నోట్