పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కేఎల్ఎం షాపింగ్ మాల్లో జాంబీరెడ్డి చిత్ర బృందం సందడి చేసింది. సినిమా ప్రమోషన్లో భాగంగా హీరో తేజ , డైరెక్టర్ ప్రశాంత్ వర్మ , గెటప్ శ్రీను భీమవరంలో పర్యటించారు. మావుళ్లమ్మ అమ్మవారిని దర్శానంతరం.. షాపింగ్ మాల్‌కు వెళ్లారు.
తనది భీమవరమేనని, ఇక్కడే పుట్టి పెరిగానని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అన్నారు. త సినిమా సూపర్ హిట్ కావడం, ప్రమోషన్ కోసం భీమవరం రావటం చాలా సంతోషంగా ఉందన్నారు. త్వరలోనే పది కోట్ల క్లబ్లో తమ చిత్రం చేరుతుందన్నారు. భీమవరం వాసుల ఆతిథ్యం మరచిపోలేనని హిరో తేజ తెలిపారు ... అసలైన ఫీల్ థియేటర్లలోనే సినిమా చూస్తే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తనుకూడా భీమవరం వాసినని చెప్పుకోవటం గర్వంగా ఉందని గెటప్ శ్రీను ఆనందం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి. నేటి నుంచి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు