పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురం మండలం కేతవరంలో వైకాపా నేత సర్పంచి ఆశావహుడు వెలిది నాగబాబుకు.. ఎస్సీ యువకుడు పాలతో పాదపూజ చేశాడు. ఇప్పుడు ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. పంచాయతీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని ఓట్లను అభ్యర్థించేందుకు వెళ్లిన సందర్బంగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ వీడియో పలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావటంతో.. ఎస్సీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీలతో కాళ్లు కడిగించుకోవటం దారుణమన్నారు. ఇది అగ్రవర్ణాల పెత్తనానికి తార్కాణం అన్నారు. దీనిపై వెలిది నాగబాబు స్పందిస్తూ.. తాను ఎంత చెప్పిన వినకుండా తనపై అభిమానంతో ఆ యువకుడు ఈ పని చేసినట్లు తెలిపారు.