పశ్చిమగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఒక యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి.. గుంటూరులో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తల్లి కథనం మేరకు.. రామచంద్రాపురానికి చెందిన శ్రీరాములు శ్రీను, వెంకటలక్ష్మి దంపతులు కూలి పనుల చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు పుల్లారావు ఉన్నారు. కుమారుడు కూడా కూలి పనులకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 11వ తేదీ రాత్రి అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు పుల్లారావు ఇంటికి వచ్చి నీ తండ్రి ద్వారకాతిరుమల మండలం రాళ్లగుంటలో కోళ్లు దొంగతనం చేశాడని.. అతని బదులు నిన్ను తీసుకెళ్తున్నామని కారు ఎక్కించుకుని తీసుకెళ్లబోయారు.
చేయని నేరానికి తనను తీసుకెళ్తామని చెప్పడంతో పుల్లారావు మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. వాంతులు చేసుకుంటున్న పుల్లారావును అతని బావ గుంటూరు ప్రభుత్వాసుత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై మృతుడి తల్లి వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద స్థితిలో కేసు నమోదు చేసినట్లు చేబ్రోలు ఎస్సై ఐ. వీర్రాజు తెలిపారు.
ఇదీ చదవండి: