పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం రింగు బాండును జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికార బృందం సందర్శించింది. పోలవరం గ్రామానికి గోదావరి నదికి మధ్య ఉన్న ఏటిగట్టును పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు వల్ల ఏటిగట్టుకు తీవ్ర ముప్పు ఉండడంవల్ల పటిష్టపరిచే అంశంపై అధికారులతో చర్చించారు. ఎగువ కాఫార్ డ్యామ్ నిర్మాణం పూర్తి కావడంతో గోదావరి నీరంతా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే ద్వారా తిరిగి గోదావరిలో కలుస్తుంది.
స్పిల్ వే నుంచి వచ్చే లక్షల క్యూసెక్కుల నీరు పోలవరం రింగ్ బాండ్ ను అతి వేగంగా తాకుతుంది. ఈ కారణంగా గోదావరి ఏటిగట్టు దెబ్బతినే అవకాశం ఉంది. గత రెండేళ్ల నుంచి పోలవరం రింగ్ బాండు కోతకు గురై బలహీనంగా మారింది. గత ఏడాది పోలవరం గ్రామంలోకి సైతం వరద నీరు వచ్చి చేరింది. ఫలితంగా గ్రామస్తులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని లోతట్టు ప్రాంతాన్ని ఖాళీ చేశారు.
ప్రస్తుతం గోదావరి నది దారి మళ్లిన కారణంగా... వరద నీరు రింగ్ బాండును తాకే అవకాశం ఉంది. దీనివల్ల పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు పనులు పూర్తిస్థాయిలో పటిష్టపరిచేందుకు కార్యక్రమాన్ని చేపట్టారు. వర్షాకాలం సీజన్ ప్రారంభమయ్యేందుకు మరో రెండు నెలలు మాత్రమే సమయం ఉండటంతో పటిష్ట పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాతో పాటు గోదావరి నది ఇంజనీర్లు.. పోలవరం రింగ్ బాండ్ ను సందర్శించి.. పటిష్టపరిచేందుకు కార్యచరణ చేపట్టారు.
ఇదీ చదవండి: