రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్న పోలీసులపై మాజీ మంత్రి జవహర్... అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ అన్నారు. కొవ్వూరు డీఎస్పీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు.
వందలాది మందితో ర్యాలీ నిర్వహించినందునే మాజీ మంత్రిపై కేసు నమోదు చేశామని స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించడం వల్లే కేసు నమోదు చేశామన్నారు. రాజకీయ దురుద్దేశం లేదని.. చట్టానికి కట్టుబడి పనిచేశామని అన్నారు.
ఇదీ చదవండి: