ETV Bharat / state

పోలవరంపై రెండు రోజుల్లో సమాధానం ఇవ్వండి: కేంద్రం

పోలవరంపై ప్రధాని కార్యాలయం రాసిన లేఖకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వకపోవటంపై... కేంద్ర జలశక్తి శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. 2 రోజుల్లోపు సమాధానం పంపాలంటూ రిమైండర్ పంపింది. మరో నాలుగైదు రోజుల్లో సమగ్ర సమాచారంతో సమాధానం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక స్థాయీ సంఘం సమావేశంలోనూ పోలవరం అంశం చర్చకు వచ్చింది.

"4,5 రోజుల్లో కేంద్రానికి పోలవరంపై నివేదిక"
author img

By

Published : Sep 10, 2019, 4:50 AM IST

పోలవరం వ్యవహారంలో ప్రధాని కార్యాలయం రాసిన లేఖకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వకపోవటంపై కేంద్ర జలశక్తి శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. 2 రోజుల్లోగా సమాధానం పంపాలని రాష్ట్రానికి గుర్తు(రిమైండర్) చేసింది. పోలవరం ప్రాజెక్టు విషయమై రాష్ట్ర ప్రభుత్వ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలను, 2018 జనవరిలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మధ్య తేడాకు కారణాలను తెలపాలంటూ పీఎంవో గత నెల 20 వ తేదీన లేఖ రాసింది. దానిపై ఈ నెల 3వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. గడువు దాటిపోయి వారం కావటంతో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జలశక్తి శాఖ రిమైండర్ పంపింది. అభిప్రాయాన్ని పంపాలని గతంలో చెప్పిన పట్టించుకోకపోవటంపై అందులో తప్పుబట్టింది.
అధికారులకు ఫోన్

ప్రాజెక్టులో ఇప్పటివరకు జరిగిన పనులపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ నివేదికను తెప్పించుకుంది. అయితే అందులోని అంశాలు 2018 జనవరిలో జరిగిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు భిన్నంగా ఉండటంపై పీఎంవో ఆరాతీసింది. ఆ రోజు జరిగిన సమావేశంలో పోలవరం పాత కాంట్రాక్టురు నుంచి మెుబిలైజేషన్ అడ్వాన్సుల వసూలను వాయిదా వేయడానికి గల కారణాలను అధికారులు వివరించారు. ఇంకా ప్రత్యేక నిధి ఏర్పాటు ప్రాజెక్టులోని కొంత భాగానికి టెండర్ల జారీతో పాటు అనేక ఇతర అంశాలపై అధికారులు స్పష్టత ఇచ్చారు.ప్రధాన కాంట్రాక్టురు నుంచి కొన్ని పనులను తొలగించి కొత్త ఏజెన్సీకి వాటిని అప్పగించటానికి దారీతీసిన కారణాలను రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి అప్పట్లో సమర్థించుకున్నారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదిక అందుకు పూర్తి విరుద్దంగా ఎందుకుందో చెప్పాలని పీఎంవో కోరింది. దీనిని గుర్తుచేస్తూ కేంద్రజలశక్తి మంత్రిత్వశాఖ ప్రస్తుత నిపుణుల కమిటీ చేసిన సిఫార్సుల్లోని ప్రతి ఒక్క అంశంతో ముడిపడి ఉన్న నిబంధనలను గురించి వివరిస్తూ వెంటనే సమాధానం ఇవ్వాలని సూచించింది. ఇదే విషయమై రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్​తో కేంద్ర జలవనరులశాఖాధికారులు ఫోన్​లో మాట్లాడి వెంటెనే స్పందించాలని కోరినట్లు తెలిసింది.

పోలవరం సవరించిన అంచనాలపై చర్చల కోసం దిల్లీలో ఉన్న ఆదిత్యనాథ్ దాస్ తమకు కేంద్ర జలశక్తిశాఖ పంపిన రిమైండర్ ఇంకా అందలేదని, అందగానే సమాధానం ఇస్తామని చెప్పినట్లు సమాచారం .తాము పీఎంవో రాసిన లేఖకు సమాచారం ఇచ్చే పనిలో ఉన్నామని మధ్యలో సెలవులు రావటం వల్ల కొంత ఆలస్యమైందని వివరణ ఇచ్చినట్లు తెలిసింది. అన్ని అంశాలను క్రోడికరించి సమాధానం తయారు చేస్తున్నామని చెప్పినట్లు తెలిసింది. ఆ పనులను చీఫ్ ఇంజనీరే చూసుకుంటున్నందున్న ఆయనపై పనిభారం ఉందని అన్నింటీని పరిశీలించి 4,5 రోజుల్లో వివరణ ఇస్తామని చెప్పినట్లు సమాచారం

పార్లమెంటరీ కమిటీలోనూ చర్చ

కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి నేతృత్వంలో సోమవారం జరిగిన పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశంలోనూ పోలవరంపై చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టు పురోగతి, ఇప్పటివరకూ ఇచ్చిన నిధుల వివరాలపై స్థాయీ సంఘం ఆరా తీసినట్లు సమాచారం. పీపీఏ సీఈవో ఆర్కే జైన్ కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి యూపీ సింగ్ ఇతర అధికారులు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.5 వేల కోట్లు తిరిగి చెల్లింపుపైనా చర్చ జరిగినట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది. ఇప్పటివరకూ ఆడిటింగ్ పూర్తయిన రూ.3 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని సుబ్బరామిరెడ్డి కేంద్ర అధికారులకు సూచించినట్లు సమాచారం.

Intro:ap_cdp_16_09_driving_drive_av_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంట్రిబ్యూటర్, కడప.

యాంకర్:
కడప ట్రాఫిక్ పోలీసులు మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు వాహనాలు నడిపేందుకు అర్హులు కాదని ట్రాఫిక్ డిఎస్పి సూర్యనారాయణ స్పష్టం చేశారు. ఈ మేరకు కళాశాలలకు ద్విచక్ర వాహనాలపై వెళుతున్న విద్యార్థులను కళాశాల వద్దనే ఆపి వారి తల్లిదండ్రులను పిలిపించి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న 100 ద్విచక్ర వాహనాలను పోలీసులు జప్తు చేశారు. ఈనెల 13వ తేదీ నుంచి ఇంటర్ విద్యార్థులు ద్విచక్ర వాహనం నడప రాదని డిఎస్పి ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఎవరైనా దొరికితే సంబంధిత తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. ఇంటర్ విద్యార్థులు కళాశాల అయిపోయిన తర్వాత బైక్ పోటీలు నిర్వహిస్తున్నారని ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు.

Body:మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్

Conclusion:కడప

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.