ETV Bharat / state

'రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని స్పీకర్​ను కోరాం'

రఘురామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని వైకాపా ఎంపీలు ఆరోపించారు. స్వపక్షంలో విపక్షంలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని స్పీకర్​కు పిటిషన్ ఇచ్చినట్లు వెల్లడించారు.

ycp mp vijaya sai
ycp mp vijaya sai
author img

By

Published : Jul 3, 2020, 5:00 PM IST

Updated : Jul 3, 2020, 5:21 PM IST

మీడియాతో వైకాపా ఎంపీలు

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని స్పీకర్​కు ఫిర్యాదు చేశామని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. పార్లమెంట్​లో స్పీకర్​ ఓం బిర్లాను వైకాపా ఎంపీల బృందం కలిసింది. అనంతరం భేటీ వివరాలను వైకాపా ఎంపీలు మీడియాకు వెల్లడించారు.

క్షమశిక్షణ తప్పారు

రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు పిటిషన్ ఇచ్చాం. అన్ని విషయాలు పరిశీలించాక చర్యలు తీసుకుంటానని స్పీకర్ హామీ ఇచ్చారు. ఏ పార్టీ తరఫున ఎంపీగా ఉన్నారో ఆ పార్టీపైనే రఘురామకృష్ణరాజు ఆరోపణలు చేస్తున్నారు. స్వపక్షంలో విపక్షంలా రఘురామకృష్ణరాజు ప్రవర్తిస్తున్నారు. రఘురామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారు. ఊహాజనితమైన విషయాలను ఊహించుకుని ప్రజలకు సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏదైనా అసంతృప్తి ఉంటే పార్టీ అధినేత దృష్టికి తీసుకురావాలి. రఘురామకృష్ణరాజు క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు స్పష్టంగా కనబడుతోంది. బహిరంగంగా పార్టీ నియమావళి, క్రమశిక్షణను ఉల్లంఘించారు -విజయ సాయిరెడ్డి, వైకాపా ఎంపీ

తెదేపా నేతల ప్రోద్బలంతోనే

సీఎం జగన్ రఘురామకృష్ణరాజుకు సముచిత స్థానం కల్పించారు. ఆయన కోరిన వెంటనే కమిటీ ఛైర్మన్ పదవి వచ్చేలా చూశారు. కానీ రఘురామకృష్ణరాజు తెదేపా హయాంలో తీసుకున్న నిర్ణయాలను ప్రస్తుత ప్రభుత్వానికి ఆపాదించారు. సొంత పార్టీ నేతలపై దూషణలు చేయటం సరికాదు. తెదేపా నేతల ప్రోద్బలంతోనే రఘురామకృష్ణరాజు ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. తెదేపా నుంచి భాజపాకు వలస వెళ్లిన నేతల అండతోనే మాట్లాడుతున్నారు.వైఎస్ఆర్‌ అంటే కూడా యువజన శ్రామిక రైతు పార్టీనే- మిథున్‌రెడ్డి, వైకాపా ఎంపీ

ఆత్మపరిశీలన చేసుకోవాలి

రఘురామకృష్ణరాజు మీడియాలో మాట్లాడుతున్న విధానాన్ని గమనించాం. అందుకే ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్​కు పిటిషన్ ఇచ్చాం. రఘురామకృష్ణరాజుకు అన్ని విధాల సముచిత స్థానం కల్పించారు. ఆయన ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది- మార్గాని భరత్, వైకాపా ఎంపీ

Last Updated : Jul 3, 2020, 5:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.