పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో వయ్యేరు కాలువకు వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఫలితంగా తణుకు మండలం దువ్వ గ్రామంలో గట్టు వద్దనున్న నివాస గృహాలు మునిగిపోతున్నాయి. అలాగే గట్టును ఆనుకొని ఉన్న వీధులన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరుచేరి ఇబ్బంది పడుతున్న బాధితులంతా గట్టు పైభాగంలో తాత్కాలిక వసతి ఏర్పాటు చేసుకొని కాలం గడుపుతున్నారు. వయ్యేరు గట్టు బలహీనంగా ఉండటం వల్లే... వర్షాలు కురిసిన ప్రతీసారి ఇబ్బంది పడాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు.
దాదాపు 20 కుటుంబాలకు సంబంధించిన ఇళ్లు నీటిలో మునిగిపోయినట్లు చెబుతున్నారు. పాత పంచాయతీ కార్యాలయంలోనే దాదాపు 150 మంది గ్రామస్థులకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేసినట్లు తణుకు తహసీల్దార్ పీఎండీ ప్రసాద్ తెలిపారు.
ఇదీ చూడండి: RAINS: తగ్గని వరద ఉద్ధృతి..గులాబ్ ధాటికి అన్నదాతకు కష్టాలు