పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం16వ నెంబరు జాతీయ రహదారిని ఆనుకుని నల్లాకులవారి పాలెం గ్రామం ఉంది. చిన్న పద్దయ్య 1978లో సర్పంచ్‌గా ఎన్నికైన నాటి నుంచి 1995 వరకు మూడు పర్యాయాలు ఏక ధాటిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు. తర్వాత 3 సార్లు జరిగిన ఎన్నికలలోనూ గ్రామస్తులు ఏకమై పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
గత సారి జరిగిన ఎన్నికల్లో మాత్రం గ్రామ యువత ఎన్నికలు జరగాల్సిందేనని.. బలాబలాలు తెలుసుకోవాల్సిందే అని పట్టుపట్టడంతో ఎన్నికలు జరిగాయి. జరగనున్న ఎన్నికల్లో సైతం పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు గ్రామ పెద్దలు సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఐక్యత భావంతోనే ఏకగ్రీవం ఎన్నికలు జరుగుతున్నట్లు గ్రామస్తులు చెబుతారు.
ఇదీ చదవండి: పంచాయతీ పోరు: రెండో దశకు నేటి నుంచి నామినేషన్లు