పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి సమీపంలో వ్యాను బోల్తా పడటంతో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. దసరా నవరాత్రుల సందర్భంగా.. విజయవాడలో దుర్గమ్మను దర్శించుకుని పత్తిపాడు మండలం శరభవరం గ్రామానికి వెళుతుండగా ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రి లోకనాగు, కుమార్తె వీరలక్ష్మీ(3) మృతి చెందారు. డ్రైవర్ నిద్రమత్తులో వ్యానును వేగంగా నడడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి
Power Crisis: విద్యుత్ కొరతపై రాష్ట్రానికి ముందే కేంద్రం హెచ్చరిక