పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం మందలపర్రు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కాలువలోకి కారు దూసుకుపోవడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన బొండాడ సుమంత్, కోడె శరత్ భీమవరం నుంచి కారులో వస్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం మందలపర్రు వద్ద చేరుకోగానే అదుపు తప్పి చినకాపవరం కాలువలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. నిడమర్రు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచదవండి.