పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వెంకటాపురం వద్ద ద్విచక్రవాహనాన్ని ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతిచెందగా.. ఒకరు గాయపడ్డారు. గోపాలపురం మండలం హుకుంపేటకు చెందిన ధర్మరాజు, నాగేశ్వరరావు అనే యువకులు.. మరో వ్యక్తి కలిసి ఎలక్ట్రికల్ పనులు చేస్తుంటారు. వారు పని ముగించుకొని తమ స్వగ్రామానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: