పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం గాలాయగూడెంలో ఇద్దరు బాలురు అదృశ్యం కలకలం రేపుతోంది. బాలురు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గ్రామానికి చెందిన మేడూరి యశ్వంత్(11), కూచిపూడి అభిరామ్ (12) ఇద్దరూ వేర్వేరు చోట్ల ఆరో తరగతి చదువుతున్నారు. శనివారం మధ్యాహ్నం వీరిద్దరూ సైకిల్‌పై బయటకు వెళ్లారు. అప్పటినుంచి తిరిగి ఇంటికి చేరలేదు. బాలురు తల్లిదండ్రులు బంధువులు వారి కోసం పరిసర గ్రామాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. వీరితో పాటు పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి వారి కోసం గాలిస్తున్నారు.
ఇవీ చూడండి...