పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగి గ్రామం నుంచి కొబ్బరి డొక్కల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ట్రాక్టర్ తిరగబడిన వెంటనే కింద పడిన డ్రైవర్ చిరంజీవిపై కొబ్బరి డొక్కలు పడిన కారణంగా... అతను మృతి చెందాడు.
అదే ట్రాక్టర్ పై ప్రయాణిస్తున్న మరో ఇద్దరు కూలీలు తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని తణుకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: