ఎనిమిదేళ్ల బాలికను హత్య చేసిన నిందితులకు శిక్ష విధించాలని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి లింగపాలెం మండలంలో తోచలకరాయుడి పాలెం గ్రామస్థులు ధర్నా చేశారు. చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని రహదారిపై రాస్తారోకో చేపట్టారు.
అనంతరం తాహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. కొంతమంది నాయకులు నిందితులను కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: