పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం తంగెళ్ళమూడి గ్రామ పరిసరాల్లో తిరుగుతున్న ఓ వ్యక్తిని అనుమానంతో గ్రామస్థులు కట్టిపడేశారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అనుమానాస్పద వ్యక్తి వివరాలు ఆరా తీశారు. కృష్ణాజిల్లాలో పలు దొంగతనాలకు పాల్పడిన దొంగగా దర్యాప్తులో వెల్లడైంది. గన్నవరం ప్రాంతానికి చెందిన సతీష్‌గా పోలీసులు గుర్తించారు. పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్న సతీష్ కోసం గత కొద్ది రోజులుగా పోలీసులు గాలిస్తున్నారు. యాధృచ్ఛికంగా సతీష్‌పై గ్రామస్థులకు అనుమానం రావడంతో దొంగ పోలీసులకు దొరికిపోయాడు.
ఇదీ చదవండి గాలివానకు కూలిన దేవాలయ ధ్వజస్తంభం