ETV Bharat / state

గుడిలో దొంగతనం.. 20 లక్షల విలువైన సొత్తు మాయం - robbery in temple at pedapulleru

అమ్మవారి గుడిలో దొంగలు పడ్డారు. నగలు దోచుకెళ్లారు. ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు సీసీ కెమేరాలూ పట్టుకుపోయారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పెదపుల్లేరులో జరిగింది.

అమ్మవారి ఆలయంలో దొంగతనం
author img

By

Published : Oct 20, 2019, 5:31 PM IST

అమ్మవారి ఆలయంలో దొంగతనం

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పెదపుల్లేరు సత్తెమ్మ అమ్మవారి ఆలయంలో దొంగతనం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి గుడి తలుపులు పగులగొట్టి 15 కాసుల బంగారు ఆభరణాలు, 50 కేజీల వెండి వస్తువులు దోచుకుపోయారు. వాటివిలువ సుమారు 20 లక్షల పైనే ఉంటుందని అంచనా. ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు సీసీ కెమెరా, హార్డ్ డిస్క్​నూ దుండగులు ఎత్తుకుపోయారు. గతంలోనూ కాళ్ల మండలం దొడ్డనపూడిలో ఇదే తరహాలో చోరీ జరిగింది. ఈ రెండు చోరీలు ఒక ముఠానే చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి..

విధి నిర్వహణలో పోలీసులు ఎప్పుడూ ముందుంటారు'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.