పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడిలోని ప్రైవేటు ఆస్పత్రిలో ప్రసవం సమయంలో తల్లి,బిడ్డ మృతి చెందారు. మలకపల్లికి చెందిన వల్లభ వరపు శిరీష నొప్పులతో ఆస్పత్రిలో చేరింది. ప్రసవం అయ్యాక.. ఆమెతో పాటు బిడ్డ మృతి చెందింది. తల్లి,బిడ్డ మృతికి ఆస్పత్రి వైద్యులు కారణం అంటూ కుటుంబ సభ్యులు, స్థానికులు ఆసుపత్రి వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల మృతి చెందారంటూ, న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. కనీసం తల్లి,బిడ్డల మృత దేహాలు కూడా చూడడానికి లోపలకు పంపలేదని బంధువులు ఆరోపించారు.
ఇవీ చదవండి