3 రాజధానుల అంశంపై న్యాయస్థానాల తీరుపై మాట్లాడిన ఆయన శాసనసభలో తీర్మానం చేశాక పరిపాలనలో ఎవరు వేలు పెట్టడానికి లేదని, చట్టసభలో తీసుకున్న నిర్ణయాలు ఏ కోర్టు ప్రశ్నించడానికి వీలు లేదన్నారు రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఆయన.. ప్రజల కోసం చట్టసభలో తీసుకున్న నిర్ణయాలు శిరోధార్యమన్నారు. చట్టసభలో తీసుకున్న నిర్ణయాలు పోలీస్ శాఖ, న్యాయ వ్యవస్థ అమలు చేయాలి కానీ.. ప్రశ్నించే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు.
దేవాలయాలపై దాడులు జరగడం దురదృష్టకరమైతే.. ప్రతిపక్షాలు ఈ ఘటనను రాజకీయ లబ్ది కోసం వాడుకోవడం మరింత దారుణమని కోన రఘుపతి అన్నారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రులు ఎవరైనా బాధ్యత వహించారా అని ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలపై రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు ప్రవర్తింస్తున్న తీరు సరికాదని హితవు పలికారు.
ఇవీ చూడండి...