పశ్చిమగోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ప్రస్తుత ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరావు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కరోనా నిధుల సమీకరణ, ఇళ్ల స్థలాల భూసేకరణ అంశాలపై ఇరువురు నేతలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు.
ఆరిమిల్లి ఆరోపణలు
తణుకు తెదేపా కార్యాలయంలో మాట్లాడిన ఆరిమిల్లి రాధాకృష్ణ.. కరోనా సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి పెద్ద ఎత్తున నిధులు వచ్చాయని, ఆ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల భూసేకరణలోనూ అవకతవకలు జరిగాయని ఆరోపించారు. తక్కువ ధరకు భూముల వచ్చే అవకాశం ఉన్నా.. అధిక మొత్తంలో ధరలు చెల్లించి భూమిని సేకరించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. లబ్ధిదారుల నుంచి రూ.30 వేల నుంచి రూ.75 వేల వరకు మామూళ్లు వసూలు చేశారన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కారుమూరి కౌంటర్
ఆరిమిల్లి రాధాకృష్ణ చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు స్పందించారు. భూసేకరణ విషయంలో తన ప్రమేయం లేదని ఆయన పేర్కొన్నారు. పైడిపర్రుకు సంబంధించిన భూమి విషయంలోనే తాను జోక్యం చేసుకున్నానని చెప్పారు. భూసేకరణ విషయంలో ఎలాంటి అవినీతి జరగలేదని ఎమ్మెల్యే కారుమూరి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి..