ETV Bharat / state

Suicide: బిల్లులు చెల్లించలేదని తెదేపా కార్యకర్త ఆత్మహత్యాయత్నం - తెదేపా కార్యకర్త ఆత్మహత్యా యత్నం

ఉపాధి హామీ పథకం పనుల బిల్లులు చెల్లించలేదని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన తెదేపా కార్యకర్త రంజిత్ కుమార్ మనస్థాపంతో పురుగులమందు తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించారు.

తెదేపా కార్యకర్త ఆత్మహత్యా యత్నం
తెదేపా కార్యకర్త ఆత్మహత్యా యత్నం
author img

By

Published : Oct 11, 2021, 10:41 PM IST

ఉపాధి హామీ పథకం పనుల బిల్లులు చెల్లించలేదని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో రంజిత్ కుమార్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. శనివారపుపేటకు చెందిన రంజిత్ కమార్ తండ్రి తెలుగుదేశం హయాంలో ఉపాధి హామీ పనులు చేశారు. అతనికి 24 లక్షల రూపాయల బిల్లులు రావాల్సి ఉండగా.. అవి ఇవ్వకుండా అధికార పార్టీ నేతలు ఇబ్బందులకు గురి చేశారని కుటుంబ సభ్యులంటున్నారు. అదే బాధలో రంజిత్‌ కుమార్ తండ్రి గుండెపోటుతో మరణించారు. రంజిత్ కుమార్ కూడా బిల్లుల కోసం తిరుగుతున్నా.. వైకాపా నాయకులు పార్టీలో చేరాలని డిమాండ్ చేస్తున్నారని.. అందుకే మనస్థాపంతో పురుగుల మందు తాగినట్లు రంజిత్ కుమార్ కుటుంబ సభ్యులంటున్నారు.

ఇదీ చదవండి: Murder: యువకుడి దారుణ హత్య..ప్రేమ వ్యవహారమేనా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.