పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఉచిత వైద్య శిబిరాన్ని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ప్రారంభించారు. ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రోగులకు ఉచిత పరీక్షలు నిర్వహించారు. అనంతరం మంత్రి రోగులకు ఉచితంగా మందుల పంపిణీ చేశారు. ఇలాంటి వైద్య శిబిరాలు ఏర్పాటు వల్ల నిరుపేదలకు లబ్ది చేకూరుతుందని మంత్రి అన్నారు. మరిన్ని స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి శిబిరాలు నిర్వహించడానికి ముందుకు రావాలని...గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇదీ చదవండీ...ఆ సంఘం గుర్తింపును వెంటనే రద్దు చేయాలి: బొప్పరాజు