మద్యం దొరక్క స్పిరిట్ తాగిన ఘటనలో ఓ యువకుడు ప్రాణం కోల్పోయాడు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరుకు చెందిన ధర్నాల నవీన్ మూర్తిరాజు(22), అల్లాడి వెంకటేష్, ఇరగవరం మండలం కావలిపురానికి చెందిన పండూరి వీరేష్, తణుకు దుర్గారావు, కె.వెంకటదుర్గాప్రసాద్, విప్పర్తి శ్యాంసుందరం స్నేహితులు. వీరేష్ స్థానిక కెమికల్స్ కంపెనీలో గుమస్తాగా పని చేస్తుంటాడు. మార్చి 29న కంపెనీకి వచ్చిన స్పిరిట్ తీసుకొచ్చాడు. దాన్ని కావలిపురం చెరువు వద్ద శీతల పానీయంలో కలుపుకొని స్నేహితులంతా తాగి ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. 30న కడుపులో మంటతో తణుకులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవీన్ మూర్తిరాజు మృతిచెందాడు. ఇదే సమస్యతో వెంకటేష్, వీరేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మందు దొరకక స్పిరిట్ తాగి యువకుడి మృతి - వేల్పూరులో స్పిరిట్ తాగి యువకుడి మృతి
లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఈ పరిస్థితుల్లో కొంతమంది యువకులు మందు దొరక్క స్పిరిట్ తాగేశారు. దాని ప్రభావంతో ఓ యువకుడు మరణించగా... ఇద్దరు ఆసుపత్రి పాలయ్యారు.
మద్యం దొరక్క స్పిరిట్ తాగిన ఘటనలో ఓ యువకుడు ప్రాణం కోల్పోయాడు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరుకు చెందిన ధర్నాల నవీన్ మూర్తిరాజు(22), అల్లాడి వెంకటేష్, ఇరగవరం మండలం కావలిపురానికి చెందిన పండూరి వీరేష్, తణుకు దుర్గారావు, కె.వెంకటదుర్గాప్రసాద్, విప్పర్తి శ్యాంసుందరం స్నేహితులు. వీరేష్ స్థానిక కెమికల్స్ కంపెనీలో గుమస్తాగా పని చేస్తుంటాడు. మార్చి 29న కంపెనీకి వచ్చిన స్పిరిట్ తీసుకొచ్చాడు. దాన్ని కావలిపురం చెరువు వద్ద శీతల పానీయంలో కలుపుకొని స్నేహితులంతా తాగి ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. 30న కడుపులో మంటతో తణుకులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవీన్ మూర్తిరాజు మృతిచెందాడు. ఇదే సమస్యతో వెంకటేష్, వీరేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి:
పేద కుటుంబాల కోసం రూ.1300 కోట్లు విడుదల