ETV Bharat / state

Midday Meals: మధ్యాహ్న భోజన పథకం బిల్లులు రాక.. కార్మికులు అప్పులపాలు ! - బిల్లుల కోసం మధ్యాహ్న భోజన కార్మికుల ఇక్కట్లు

పేద విద్యార్థులకు నేరుగా ప్రయోజనం చేకూర్చే మధ్యాహ్న భోజన పథకానికి(Midday Meals scheme) పేర్లు మార్చేందుకు ఆసక్తి చూపే ప్రభుత్వం.. ఆ పథకాన్ని మెరుగుపర్చేందుకు యత్నించకపోవడంతో కార్మికుల కష్టాలు ఏటా పెరుగుతున్నాయి. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వండివార్చినప్పటికీ ప్రతి నెలా ప్రభుత్వం బిల్లులు చెల్లించట్లేదు. దీంతో నిరుపేదలు, నిరక్షరాస్యులైన మధ్యాహ్న భోజన కార్మికులు అప్పులపాలవుతున్నారు.

Midday Meals workers problems
మధ్యాహ్న భోజన కార్మికుల గోడు
author img

By

Published : Sep 26, 2021, 7:20 PM IST

మధ్యాహ్న భోజన బిల్లులు రాక కార్మికుల కష్టాలు

పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం(Midday Meals scheme) వండే వంట ఏజెన్సీ కార్మికుల(Cooking agency workers)కు ఐదు నెలలుగా బిల్లులు(midday meals scheme bills) అందడం లేదు. ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రభుత్వాధికారులు కాలయాపన చేస్తున్నారే తప్ప బకాయిలు చెల్లించట్లేదు. అందినకాడికి అప్పులు తెచ్చి ప్రతినెలా పెట్టుబడి పెడుతున్నారు. కనీస వేతనాలు ఆశించకుండానే పని చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం బిల్లులు చెల్లించట్లేదు. వేలాది రూపాయలు బిల్లుల బకాయిలు పేరుకుపోతున్నాయి. విద్యార్థులు అధికమంది ఉన్న ఉన్నత పాఠశాలల్లో నెలకు సుమారు లక్ష రూపాయల వరకు బిల్లు అవుతుంది.

సాధారణ ప్రాథమిక పాఠశాలల్లో 50వేల రూపాయల బిల్లు వస్తుంది. ఐదు నెలలుగా బిల్లులు రాకపోవడంతో వంట ఏజెన్సీ కార్మికులు అధిక వడ్డీలకు అప్పులు చేశారు. బియ్యం, కోడిగుడ్లు మాత్రమే ప్రభుత్వం అందిస్తుంది. మిగిలినదంతా ఏజెన్సీ కార్మికులే కొనుగోలు చేయాల్సి ఉండటంతో అప్పుల పాలవుతున్నామని వాపోతున్నారు.

బిల్లులు చెల్లించకపోగా.. వేధింపులు

జిల్లాలో 2018ప్రాథమిక, 219ప్రాథమికోన్నత, 359 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మున్సిపాలిటీ, ఎయిడెడ్ పాఠశాలల్లో మొత్తం కలిపి 31 లక్షల 33 వేల 340 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి రోజువారీ ఖర్చు లక్షల్లో అవుతుంది. ప్రతి నెలా చెల్లింపులు చేయకపోవడంతో ఏజెన్సీలకు బకాయిలు పేరుకుపోతున్నాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 13కోట్ల రూపాయలు కార్మికులకు చెల్లించాల్సి ఉంది. విద్యార్థులు ఎక్కువ మంది ఉన్న పాఠశాలల్లో లక్షల రూపాయలు అప్పులు చేసి మరీ నిర్వాహకులు వండిపెడుతున్నా.. బిల్లులు(struggle for midday meals bills) చెల్లించడం లేదు. గౌరవ వేతనమూ ప్రతి నెలా అందట్లేదు. బిల్లులు, వేతనాలు ఇవ్వకపోగా నాణ్యత లేదంటూ వేధింపులకు గురిచేయటం ఎంతవరకూ సబబు అని వంట ఏజెన్సీ సంఘం(union of Midday Meals agency ) నేతలు ప్రశ్నించారు. పరిస్థితి ఇలానే కొనసాగితే మధ్యాహ్న భోజన పథకం(Midday Meals scheme) నిర్వహణ అసాధ్యమని కార్మికులు తెలిపారు.

ఇదీ చదవండి..

మూడు తరాలుగా ఒకే వైద్యవృత్తి... అమ్మమ్మ, అమ్మ, మనుమరాలిదీ ఒకే బాట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.