ETV Bharat / state

ఆస్తి వివాదంలో కన్న తండ్రినే కడతేర్చిన కుమారుడు - టి.నరసాపురంలో తండ్రిని నరికి చంపిన తనయుడు

ఆస్తి తగాదా విషయంలో కన్న తండ్రిని చిన్న కుమారుడే దారుణంగా నరికి చంపాడు. పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురంలో జరిగిన ఈ ఘటన.. స్థానికంగా కలకలం సృష్టించింది. తన వద్ద తీసుకున్న లక్షల రూపాయలను తిరిగి ఇవ్వమని తండ్రి అడగగా.. కొంత కాలంగా నడుస్తున్న వివాదాలు చివరకు హత్యకు దారితీశాయి.

son killed father
కుమారుడి చేతిలో తండ్రి హతం
author img

By

Published : Dec 13, 2020, 7:25 PM IST

పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురంలో.. ఆస్తి తగాదా విషయంలో కన్న తండ్రినే అతి కిరాతకంగా హత్య చేశాడో కుమారుడు. తనకు పంచి ఇచ్చిన పొలాన్ని ట్రాక్టర్​తో దున్నుతుండగా.. చిన్న కుమారుడు కత్తితో తండ్రి బళ్లా లక్ష్మీనారాయణ మెడపై బలంగా నరికాడు. నోటి నుంచి సగం మేర తల తెగిపోయి.. తండ్రి అక్కడికక్కడే మృతి చెందాడు.

కుమారుడి చేతిలో తండ్రి హతం

పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న లక్ష్మీనారాయణకు రెండున్నర ఎకరాలు భూమి ఉంది. ఇద్దరు కుమారులకు కొంత పంచి ఇచ్చి.. మిగిలిన దానిలో సేద్యం చేస్తూ ఉండేవాడు. చిన్న కుమారుడు ఇటీవల ఇంటి నిర్మాణం చేపట్టగా.. తండ్రి నుంచి లక్షల రూపాయలను తీసుకున్నాడు. వాటిని తిరిగి ఇవ్వాలని అడగుతుండటంతో.. తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తన భూమిని తనే సాగు చేసుకుంటానని దుక్కి దున్నుతున్న తండ్రిపై.. కుమారుడు కత్తితో దాడిచేసి హతమార్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇదీ చదవండి:

మినీ రైతుబజార్లు.. సమన్వయలోపంతో నిరుపయోగం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.