ETV Bharat / state

రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు

author img

By

Published : Mar 10, 2021, 9:26 PM IST

మహాశివరాత్రి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

Shivratri celebrations got off to a great start in the Tanuku zone of West Godavari district
రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన శివరాత్రి ఉత్సవాలు

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను ఆలయ అధికారులు ఘనంగా ప్రారంభించారు. చారిత్రక ప్రాధాన్యత గల ఈ దేవాలయంలో తరతరాలుగా సాంప్రదాయానుసారంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. 11వ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన రాజనరేంద్రుని కాలం నుంచి ఈ ఆలయం ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.

ఉత్సవాల్లో భాగంగా మహా శివరాత్రి ముందు రోజు నిర్వహించే శూలాల సంబరం ఒళ్ళు పులకరించేలా ఉంటుందని స్థానికులు తెలిపారు. గ్రామానికి చెందిన చేనేత కులస్తులు పొడవాటి శూలాలను బుగ్గల్లో పొడుచుకోవటం, ఇనుప కొక్కాలను వీపునకు గుచ్చుకుని రథం లాగడం, క్రేన్​కు వేలాడడం వంటి విన్యాసాలు ఒళ్ళు గగుర్పాటు కలిగించేలా ఉంటాయని అన్నారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్లు పరమశివుని అనుగ్రహం ద్వారానే ఇవన్నీ సాధ్యమని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు.

ఇదీ చదవండి:

పోలవరంలో రెండు శాతం పనులైనా చేశారా..? దేవినేని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.