పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎస్ఈబీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. చింతలపూడి, లింగపాలెం మండలాల్లోని నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు చేశారు. సారా తయారీ కోసం అక్కడ నిల్వ ఉంచిన 4 వేల లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు ఎస్ఈబీ సీఐ సుధ తెలిపారు.
వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా యండపల్లి గ్రామం వద్ద తెలంగాణ మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. వారి నుంచి 32 తెలంగాణ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చదవండి: