ETV Bharat / state

Salt farmers అకాల వర్షాలకు ఉప్పు రైతుల విలవిల.. దిక్కుతోచని స్థితిలో సర్కారువైపు చూపు - వర్షాలవల్ల నష్టపోయిన ఉప్పు రైతులు

Salt farmers affected by rains: అకాల వర్షం ఉప్పు రైతులనూ నష్టపరిచింది. పశ్చిమగోదావరి జిల్లానరసాపురం మండలం పెదమైనవానిలంకలో.. ఉప్పుమడులు దెబ్బతిన్నాయి. PMలంక, చినమైనవానిలంక గ్రామాల పరిధిలో సుమారు 300 ఎకరాల్లో రైతులు ఉప్పుసాగు చేస్తున్నారు. ఈ ఏడాది రెండుసార్లు అకాల వర్షంతో ఉప్పుసాగు దెబ్బతిందని రైతులు వాపోతున్నారు.

farmers affected by rains
farmers affected by rains
author img

By

Published : May 5, 2023, 12:46 PM IST

Updated : May 5, 2023, 1:12 PM IST

Salt farmers affected by rains: అకాల వర్షం ఉప్పు రైతులనూ నష్టపరిచింది. ఉప్పు సాగునే నమ్ముకున్న రైతులకు ప్రస్తుతం నెలకొన్న అననుకూల వాతావరణంతో ఉపాధి కరువై తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరికి ప్రభుత్వపరంగా సహాయ సూచనలు కూడా అందడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం మండలం పెదమైనవానిలంకలో గ్రామంలో ఉప్పు సాగు రైతులతు అకాల వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లింది. గతంలో నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని కేపీపాలెం సౌత్, తూర్పుతాళ్లు, పీయంలంక తదితర గ్రామాల్లో సుమారు మూడు వేల ఎకరాల్లో రైతులు ఉప్పు సాగు చేసేవారు. సాగు గిట్టుబాటవక పలువురు రైతులు విరమించారు. ఆ భూములను ఆక్వా చెరువులుగా మార్చారు. ప్రస్తుతం పీఎంలంక, చినమైనవానిలంక గ్రామాల పరిధిలో సుమారు మూడు వందల ఎకరాల్లో, రైతులు ఉప్పుసాగు చేస్తున్నారు.

ఎకరా భూమిని వంద మడులుగా చేసి చదును చేస్తారు. దీనికి రోజుకు ఐదుగురు కంటే ఎక్కువగా కూలీల అవసరం ఉంటుంది. అలా సుమారు 40 రోజులు మడులను సిద్ధం చేస్తారు. అనంతరం నేలబావి తవ్వి దానిలోని నీటిని ఆ మడుల్లో నింపుతారు. ఆ సమయంలో ఉష్ణోగ్రతలు ఎంత ఎక్కువగా ఉంటే దిగుబడులు అధికంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. మడులు సిద్ధం చేసేందుకే ఎకరాకు యాభై వేల రూపాయల పైబడి ఖర్చవతుందని రైతులు తెలిపారు.

ఈ ఏడాది సంభవించిన అకాల వర్షాలతో ఉప్పు సాగు మొత్తం దెబ్బతింది. మార్చి నెల ఆరంభం నుంచి ఉప్పు దిగుబడులు ప్రారంభమయ్యాయి. ఆ నెల 15న సంధించిన వర్షంతో మడులు వాననీటితో మునిగాయి. రైతులు ఎంతో వ్యయప్రయాసలతో ఆ నీటిని బయటకు తోడి.. మడులను సిద్ధం చేశారు. ఈ వారంలోనే ఉప్పు దిగుబడులు ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో అకాల వర్షం ప్రతాపం చూపడంతో మడులు నీటమునిగి రైతుల ఆశలు గల్లంతయ్యాయి. దీంతో ఈ ఏడాది ఉప్పుసాగు చేయలేమని రైతులు చెబుతున్నారు.

తిరుమాని నరసింహస్వామి, ఉప్పు రైతు..

తిరుమాని నరసింహస్వామి, ఉప్పు రైతు
తిరుమాని నరసింహస్వామి, ఉప్పు రైతు

" గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది సాగు కాలంలో రెండు సార్లు ఆకాల వర్షం సంభవించింది. వర్షానికి ఉప్పు మడుల్లోకి నీరు చేరి మా కష్టమంతా వృథా అయ్యింది. దీంతో ఒక్కొక్క ఎకరాకు రూ.50వేలు వరకూ నష్టం వాటిల్లింది. నేను రెండెకరాల్లో మడులు ఏర్పాటుచేసి ఉప్పు సాగుచేశాను. దీనికి సుమారు రూ 1.50 లక్షలు వరకూ ఖర్చయ్యింది. ఈ ఏడాది అధిక ఎండలు ఉంటాయనుకున్నాం.. దిగబడులు బాగుంటాయని అప్పుచేసి మరీ సాగుచేసాను. వర్షంతో మడులు దెబ్బతిన్నాయి. ఇప్పటివరకూ వచ్చిన ఉప్పు దిగుబడికి యాభై వేల రూపాయల వరకూ తిరిగి వచ్చింది.. ఇంకా రూ లక్ష నష్టం వాటిల్లింది. ఆకాల వర్షాలతో ఉప్పుసాగులో తీవ్రంగా నష్టపోయాం. మమ్ములను ప్రభుత్వం ఆదుకోవాలి. ఇప్పటికే చాలామంది మా తోటి రైతులు సాగులో నష్టాలను భరించలేక ఆక్వాసాగువైపునకు మల్లారు. ప్రభుత్వ సహకారం అందించకుంటే భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఉప్పుసాగు చేయలేం".

అకాల వర్షాలకు ఉప్పు రైతుల విలవిల

ఇవీ చదవండి:

Last Updated : May 5, 2023, 1:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.