ETV Bharat / state

APSRTC: ఊడిన ఆర్టీసీ బస్సు చక్రాలు... తృటిలో తప్పిన ప్రమాదం - పశ్చిమ గోదావరి జిల్లా తాజా వార్తలు

పశ్చిమ గోదావరి జిల్లా ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. నర్సాపురం డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు నరసాపురం నుంచి ఏలూరు వెళ్తుండగా వెనుక చక్రం ఊడిపోయాయి. డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు.

APSRTC
ఊడిన ఆర్టీసీ బస్సు చక్రాలు
author img

By

Published : Oct 11, 2022, 11:45 AM IST

నడుస్తున్న ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు అకస్మాత్తుగా ఊడిపోయిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం అజ్జమూరు వద్ద సోమవారం ఉదయం చోటు చేసుకుంది. వెంటనే బస్సు నిలిచిపోవడంతో దానిలో ఉన్న 40 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు, ప్రయాణికుల కథనం ప్రకారం.. నరసాపురం డిపోకు చెందిన బస్సు జాతీయ రహదారి మీదుగా ఏలూరు వెళ్తుండగా అజ్జమూరు వద్ద వెనుక భాగంలో ఓ వైపున రెండు చక్రాలు ఊడిపోయాయి. ఒకటి పూర్తిగా బయటకు వచ్చింది. దీనిని గుర్తించిన డ్రైవర్‌ వెంటనే బస్సును నిలిపివేశారు. ఒక్కసారిగా భారీ శబ్దంతో బస్సు ఒరిగిపోవడంతో దానిలో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం వారిని వేరే బస్సుల్లో గమ్యస్థానాలకు పంపారు. గోతులమయంగా ఉన్న రహదారుల వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.