పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం పట్టిసీమలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి కృష్ణా జిల్లాకు గోదావరి నీటిని నీటిపారుదల శాఖ అధికారులు విడుదల చేశారు. మూడు పంపుల ద్వారా 1050 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు పోలవరం ప్రాజెక్ట్ సీఈ ఎం. సుధాకర్ బాబు తెలిపారు. అధికారులు పూజలు నిర్వహించి మోటర్లను ప్రారంభించారు. ప్రస్తుతం గోదావరిలో 14.4 మీటర్ల ఎత్తుకు నీరు పెరగడంతో నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. జలాలు పెరిగితే మరిన్ని పంపుల ద్వారా నీటిని విడుదల చేస్తామన్నారు.
ఇదీ చూడండి. 'కువైట్లో బతకలేకపోతున్నాం.. దయచేసి మమ్మల్ని ఇంటికి చేర్చండి'